calender_icon.png 5 December, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటక నేతలకు ఆహ్వానం

05-12-2025 08:21:02 AM

హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit)కు కర్నాటక నేతలకు ఆహ్వానించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Karnataka CM Siddaramaiah), డీకే శివకుమార్ ను రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ఆహ్వానించారు. బెంగళూరులో సీఎం, డిప్యూటీ సీఎంతో భేటీ అయిన శ్రీధర్ బాబు ఆహ్వానం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8,9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. 

''బెంగళూరు పర్యటన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లను కలవడానికి 8 -9 తేదీలలో 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో జరిగే 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు హృదయపూర్వకంగా ఆహ్వానించడానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందించింది. తెలంగాణ పెద్ద ప్రపంచ వేదికపై స్థానం సంపాదించుకున్నందున పొరుగు రాష్ట్రాలతో సహకారాన్ని బలోపేతం చేయడం చాలా అవసరం. సహకారం, ఆవిష్కరణ, సామూహిక పురోగతి ద్వారా దక్షిణ భారతదేశ వృద్ధి కథను నడిపించడానికి ఉమ్మడి నిబద్ధతను బలోపేతం చేస్తుంది." అని శ్రీధర్ బాబు ఎక్స్ లో పేర్కొన్నారు.