17 April, 2026 | 11:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వైభవంగా అయ్యప్ప స్వామి రథయాత్ర వేడుకలు

31-12-2025 03:27 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ లో గల శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి భక్తులు స్వామివారి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పురవీధుల గుండా సాగిన రథయాత్రకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అయ్యప్ప స్వామి దీక్ష ధారణ చేసిన స్వాములు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై చేసిన భజనలు, నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సాయిరి మహేందర్ పద్మ దంపతుల ఆధ్వర్యం లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్వైజర్ కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), ముస్త్యాల రవీందర్  పెద్ద ఎత్తున భక్త బృందం పాల్గొన్నారు.