31-12-2025 03:20:47 PM
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పురాతన పండుగలు భారతీయ సంస్కృతిలో ప్రధానమైన స్థానాన్ని కలిగి ఉన్నాయని, సాంప్రదాయాలు, ఆచారాలతో ప్రజల్లో ఆధ్యాత్మికత పెంపొందుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో పురాతన పండుగ యొక్క విశిష్టతను తెలుపుతూ కేజీ విద్యార్థులు హార్మోని పేరిట నిర్వహించిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... డిజిటల్ యుగంలో సైతం పురాతన పండుగల విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేయాలని ఆలోచనతో విద్యార్థులచే ప్రత్యక్షంగా పండుగలు నిర్వహిస్తూ విద్యాబోధన చేస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు నిష్ణాతులైన అధ్యాపకులచే విద్యా బోధన చేస్తూ విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడంతో పలు రంగాల్లో విద్యార్థులు రాటుదేలుతున్నారని అన్నారు.
చదువుతోపాటు సాంస్కృతిక, క్రీడారంగంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. పండుగలు యొక్క విశిష్టతను తెలుపుతూ విద్యార్థులు ప్రదర్శించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులచే చక్కటి ప్రదర్శన ఇచ్చేలా ప్రోత్సహించిన అధ్యాపకులను అధినేత నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాప బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.