13-12-2024 12:37:17 AM
మంథని, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ప్రజలకు ఎల్లప్పడూ అయ్యప్పస్వామి ఆశీస్సులు ఉంటాయని, స్వామి కృపతో వారికి సుఖశాంతులు కలగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. మంథనిలోని అయ్యప్ప దత్తాత్రేయస్వామి ఆలయంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజలో మంత్రి ప్రత్యే పూజలు చేశారు. మంత్రికి అర్చకులు మం త్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ.. అయ్యప్ప ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి చిల్లపల్లిలో పర్యటించారు. పంచాయతీకి ఫ్రెండ్లీ ఉమెన్ క్యాటగిరీలో జాతీయ స్థాయి అవార్డు దక్కినందుకు గాను ఆయన మాజీ సర్పంచ్‌ను సన్మానించారు. మంత్రి వెంట మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండ్రు రమాదేవి, మాజీ సర్పంచ్, అయ్యప్పస్వామి ఆలయ కమిటీ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు ముస్కుల సురేందర్‌రెడ్డి, తొట్ల తిరుపతి యాదవ్, ఐలి ప్రసాద్, చొప్పరి సదానందం, శశిభూషణ్ ఉన్నారు.