09-05-2025 05:03:19 PM
భైంసా(విజయక్రాంతి): కుంటాల మండల కేంద్రం చెందిన ఆఇంటి రాజు(25) యువకుడు గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. రాజు ఓలా గ్రామం నుండి కుంటాలకు మోటార్ సైకిల్ పై వస్తుండగా అదుపుతప్పి స్తంభముకు ఢీకొట్టడంతో తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.