calender_icon.png 9 May, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకోవాలి

09-05-2025 04:36:13 PM

నిర్మల్ (విజయక్రాంతి): ల్యాండ్ రికార్డ్ సర్వే శాఖ(land record survey department) ఆధ్వర్యంలో లైసెన్స్ సర్వే యార్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని దాన్ని సద్విని చూసుకోవాలని ల్యాండ్ రికార్డ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ రాథోడ్ కిషన్(Land Record Survey Assistant Director Rathod Kishan) తెలిపారు.

నిర్మల్ జిల్లాలోని మున్సిపల్ తో పాటు అన్ని మండలాల్లో ఇంటర్లో గణితం ఐటిఐ డ్రాప్టన్ సివిల్ ఇంజనీర్ డిప్లమా సివిల్ ఇంజనీర్ బిటెక్ తదితర కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఈ 17 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు 18 నుంచి 30 సంవత్సరాలలోపు ఉన్నవారు అర్హులన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదేళ్ల వయో సడలింపు ఉంటుందని తెలిపారు. శిక్షణ కోసం ఓసి లకు 10000 బీసీలకు 5000 ఎస్సీలకు 2500 ఫీజు ఉంటుందని ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. జిల్లాలోని కార్యాలయంలో గల 9849041489, 7032634404, 94401947339 నంబర్లను సంప్రదించాలన్నారు.