09-05-2025 04:53:04 PM
సాక్షి ఎడిటర్ ను దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
నిర్మల్, (విజయక్రాంతి): సాక్షి దినపత్రిక తెలంగాణ ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నిర్మల్ జిల్లా టి యు డబ్ల్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయులు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపి కలెక్టర్ అభిలాష అభినవ్ కు వినతి పత్రాన్ని అందించారు. పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా కొందరు దుండగులు పథకం ప్రకారం సాక్షి దినపత్రిక పై దాడులు నిర్వహిస్తున్నారని దీన్ని ప్రభుత్వం వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకయ్య గారి భూమయ్య రాసన్ శ్రీధర్ కైలాస్ పోశెట్టి రాజేశ్వర్ అన్న అశోక్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.