09-05-2025 04:31:57 PM
నిర్మల్, (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal district)లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా అందించే నోటు పుస్తకాలు శుక్రవారం నిర్మల్ కు చేరుకున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. ఈ పుస్తకాలను పట్టణంలోని మార్కెట్ కమిటీ గోదాములో నిలువ ఉంచి పాఠశాల తెరిచే నాటికి అన్ని గ్రామాల ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.