09-05-2025 04:55:53 PM
మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం-
మందమర్రి:విజయక్రాంతి: ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో బీజేపీ నాయకులు(BJP leaders) హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలో సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ లో శుక్రవారం బిజెపి నాయకులు భారీ ర్యాలీ చేపట్టి నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి, టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడికి నిరసనగా భారత ప్రభుత్వం ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, సైన్యానికి అభినందనలు తెలుపుతు న్నారన్నారు.
రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజలందరూ ఉగ్రవాదుల చర్యలకు బుద్ధి చెప్పే విధంగా సైనిక చర్యలు ఉండాలని బలంగా కోరుకుంటున్నార న్నారు. దేశ సమగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇస్తు వారికి మానసిక ధైర్యం ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు డివి దీక్షితులు, అందుగుల శ్రీనివాస్, దార రవి సాగర్, వినయ్, రంగు శ్రీనివాస్, జక్కుల సమ్మయ్య, మేకల రమేష్, బస్టాండ్ వ్యాపార సంఘం నాయకులు దూలం కనకయ్య గౌడ్, వ్యాపారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.