12 May, 2026 | 4:26 AM

ఆజంజాహి భూములను స్వాధీనం చేసుకోవాలి

05-02-2025 02:24 AM

* సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి అశోక్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ఆజంజాహి మిల్లులో కూల్చి  కార్మిక భవన్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. ఆజంజాహి మిల్లు స్థలంలో 318 మంది కార్మికులకు 23 ఎకరాలలో ఇండ్ల స్థలాలు కేటాయించాలని 20  ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

అశోక్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా గత ప్రభుత్వ హయాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌లు కలిసి దొంగ పత్రాలు తయారు చేసి కార్మిక భవన్ కలిగిన స్థలాన్ని ఓ ప్రైవేటు వ్యక్తికి అమ్ముకోవడంపై ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా కార్మికులకు ద్రోహం చేసిన న్యాయవాదులు కార్మికులకు క్షమాపణ చెప్పాలన్నారు.

ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. మిల్లు భూమిలో కార్మికులకు పట్టాలు పంపిణీ చేయాలన్నారు.