calender_icon.png 3 February, 2026 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారి (ప్రాచి) హత్య.. కన్నతండ్రే హంతకుడు

03-02-2026 02:38:29 AM

  1. ఇద్దరి నిందితుల అరెస్ట్ బైకు స్వాధీనం
  2. పోలీస్ కమీషనర్ సాయి చైతన్య వెల్లడి 

నిజామాబాద్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): నిజామాబాద్ బోధన్ డివిజన్లోని ఎడపల్లి మండలం ఎ.ఆర్.పి క్యాంపు శివారులో గత నెల 29వ తేదీ న ౄ-46/8 నిజాంసాగర్ కెనాల్ లో గుర్తుతెలియని 6 సం,, ల చిన్నారి పాప మృతదేహం దొరికిందని గ్రామస్తుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి న పోలీసు బాలిక తండ్రినీ హంతకు నీగా తేల్చారు. బోధన్ ఎసిపి  శ్రీనివాస్, ఆద్వర్యంలో పోలీస్‌లు 3 టీములుగా ఏర్పాటు చేసి పాప ఆచూకీ కోసం అన్నీ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, అన్నీ వాట్సాప్  గ్రూపులలో పాప ఆచూకీ కోసం పంపించారు.

సుధీర్ కానిస్టేబుల్ తన వాట్సాప్ స్టేటస్ ను అతని బందువులు అయిన ముఖేడ్ (మహారాష్ట్ర) గ్రామస్తులకు పంపగా, గమనించిన స్థానికులు పాప ముఖేడ్ గ్రామానికి చెందిన ప్రాచి కొండమంగలే అని తెలిపారు. ఆ సమాచారంతో  పోలీస్ టీం  గ్రామానికి వెళ్ళి మృతి చెందిన పాప ఆ గ్రామానికి చెందినదే అని నిర్ధారించి దర్యాప్తు మొదలుపెట్టి కేసును చేదించారు.  కెరుర్ గ్రామం, ముఖేడ్ తాలూకాకి చెందిన కొండమంగలే పాండురంగ అతని భార్య ముగ్గురు పిల్లలతో కలిసి విరాట్ సేలూన్ పేరుతో ముఖేడ్ లో మంగలి పని చేస్తూ జీవిస్తున్నాడు.

రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కెరుర్ గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలనే ఉద్దేశం తో ప్రస్తుత సర్పంచ్ షిండే గణేష్‌తో కలిసి ఎన్నికలలో పోటీ చేయాలంటే ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హులు అవుతారని దానికి గాను ముగ్గురు పిల్లలలో బాబుని ఎవరికైనా దత్తత ఇవ్వాలని భావించినప్పటికిని కుదరలేదు. కానీ అప్పటికే   అతని పేరు మీద బర్త్ సర్టిఫికేట్ ఉందని నిర్దారించుకునీ,  పూణే కార్పొరేషన్  ఆఫీసు వెళ్ళి బర్త్ సర్టిఫికటే మార్చాలని ప్రయత్నం చేసినప్పటికీని బర్త్ సర్టిఫికటే మారదు అని అధికారులు తేల్చి చెప్పారు.

చిన్నారి తండ్రి పాండురంగ కొండ మంగలి, గణేష్ సిందే ఇద్దరు కలిసి పథకం వేసి ముగ్గురు పిల్లలలో ఒకరిని చంపేసి తప్పి పోయినట్లు చెప్పలని  పథకం వేశారు. అందులో బాగంగానే పెద్ద కూతురు ప్రాచీ ని అతని తండ్రి తన బైక్‌పై మాయ మాటలు చెప్పి నిజామాబాద్ తీసుకు వచ్చి మార్గం మద్యలో డి-46/8 నిజాం సాగర్ కెనాల్, ఎడపల్లి యందు బ్రతికి ఉండగానే అట్టి కాలువలో తోసి హత్యకు పాల్పడ్డాడు.

ఇ కేసులో పకడ్బందీగా వ్యవహరించి కేసును ఛేదించినoదుకు  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, విజయ్ బాబు బోధన్ రూరల్ సి.ఐ. పోలీస్, ముత్యాల రమ ఎస్త్స్ర ఎడపల్లి, కే.చంద్రమోహన్, ఎస్త్స్ర రెంజల్, బాబు రావు, ఏఎస్‌ఐ, సుదీర్, కానిస్టేబుల్, శ్రీకాంత్ కానిస్టేబుల్ లను సిపి అబినందించారు