హుజూరాబాద్ బస్టాండులో అమానవీయ ఘటన
10-05-2024 05:58 PM
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బస్టాండులో శుక్రవారం అమనవీయ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు పసికందును బస్టాండులో వదిలివెళ్లిపోయారు. చీమలు పట్టిన స్థితిలో రోజుల పసికందు మృతదేహం నేడు లభ్యం అయింది. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం శిశువును వదిలివెళ్లి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుజూరాబాద్ బస్టాండ్ లోని సిసి ఫుటేజీని పరిశీలిస్తున్నారు.






