30 August, 2026 | 9:03 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

చెట్ల పొదల్లో పసికందు

13-11-2024 04:19 PM

కొండపాక (విజయక్రాంతి): కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో పల్లె మీద (శివాజీ నగర్) నుండి దర్గాకు వెళ్లే రోడ్డు మార్గంలో అప్పుడే పుట్టిన ఆడబిడ్డను చెట్ల పొదలలో వదిలి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు, అటుగా వెళుతున్న దుద్దెడ మాజీ సర్పంచి ఆరెపల్లి మహదేవ్ గౌడ్ చూసి 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగానే, వెంటనే 108 సిబ్బంది, ఘటన స్థలానికి చేరుకొని పాపను అంబులెన్స్ లో ప్రథమ చికిత్స చేస్తూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న గ్రీష్మ, ఆసుపత్రి సిబ్బంది సమక్షంలో పాపను సురక్షితంగా అప్పగించారు.