calender_icon.png 11 July, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్స్‌లో పసికందు మృతదేహం కలకలం

11-07-2025 12:49:08 AM

ఖైరతాబాద్; జూలై 10 (విజయక్రాంతి) : పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ టాయిలెట్ లో పసికంధ మృతదేహం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. గురువారం నిమ్స్ హాస్పిటల్లో ఓపి బిల్డింగ్ లో మహిళ బాత్రూంలో నీరు జామ్ కావడంతో దానిని క్లియర్ చేసే ప్రయత్నంలో పారిశుద్ధ పనులు చేస్తున్న కార్మికులు పసికందు మృతదేహాన్ని గమనించారు. వెంటనే హాస్పిటల్  యాజమాన్యానికి సమాచారం అందించారు. గుర్తుతెలియ ని వ్యక్తులు బుధవారం మ్యాన్ హోల్ లో పసికందున పడేసినట్లు అనుమానిస్తున్నారు. సిబ్బంది వెంటనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.