calender_icon.png 11 July, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా హెల్త్ క్యాంపు విశేష స్పందన

11-07-2025 12:49:25 AM

మలక్‌పేట, జూలై 10 (విజయ క్రాంతి): పాత మలక్పేట్ డివిజన్లోని పంచశీల్ లైబ్రరీలో మలక్పేట యూ పి హెచ్ సి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఉదయం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే అహ్మద్ బలాల ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అహ్మద్ బలాల మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎం టమాలజీ ఇబ్బంది తరచూ దోమలు వ్యాపించే ప్రాంతంలో ఫాగింగ్  చేయాలని పేర్కొన్నారు.

హెల్త్ క్యాంప్ లోను విస్తృతంగా కాలనీలో బస్తీలలో తరచు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందు బిల్లలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకుడు సైఫుద్దీన్ షఫీ, వాసు, నక్క అమరేందర్ గౌడ్, చందు తదితరులు పాల్గొన్నారు.