11-07-2025 12:46:54 AM
తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ వసూళ్లు
అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
అదిలాబాద్, జూలై 10 (విజయక్రాంతి): పోలీసులమంటూ నగల దుకాణాల యజ మానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న అంతర్ రాష్ట్ర నకిలీ పోలీసుల గుట్టును ఆదిలాబాద్ పోలీసులు రట్టు చేశా రు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగళూ రులోని పలు జూవెలర్స్ యజమానులకు నకిలీ పోలీసులు ఫోన్ చేసి మీరు దొంగ బంగారం కొన్నారంటూ బెదిరించి వసూ ళ్లకు పాల్పడ్డారు.
ఆదిలాబాద్ వన్ టౌన్, ఇచ్చోడ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్లమంటూ.. తన సోదరుడు చేపురి సతీష్ కుమార్ కాల్ చేసి, తాను ఇచ్చోడ పీఎస్ ఎస్సై నర్సిరెడ్డి అంటూ పరిచయం చేసుకుని, నాలుగేళ్ల క్రితం 11 గ్రాముల దొంగ బంగారం కొన్నా రని, కేసు కాకుండా ఉండాలంటే ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపాలని బెదిరించాడం టూ జూన్ 27న రంగారెడ్డికి చెందిన కొం డొజు నరసింహచారి అనే వ్యక్తి ఇచ్చోడ ఎస్సై పురుషోత్తంకు ఫిర్యాదు చేశారు.
ఫోన్ చేసింది నకిలీ పోలీసు అని తెలియడంతో ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన రుద్రంగి కిరణ్‌కుమార్‌ను కూడా ఇచ్చోడ ఎస్సై నర్సిరెడ్డినంటూ ఫోన్ చేసి దొంగ బంగారం కొన్నారని బెదిరించడంతో ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపినట్టు ఈ నెల 4న ఇచ్చోడ ఎస్సైకి తెలిపారు. ఇది కూడా నకిలీ పోలీసు పనిగా నిర్ధారణ అయింది. ఈ రెండు కేసు లపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
సాంకేతిక ఆధారాల ద్వారా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో నల్గొండ జిల్లా మాన్యంచల్కకు చెందిన పశు వుల వ్యాపారి షేక్ ఇర్ఫాన్, నిడమనూరుకు చెందిన లారీ క్లీనర్ చింతలచెరువు ప్రశాంత్, నిడమనూరుకు చెందిన మోటార్ మెకానిక్ బదనపూరి అజయ్, వెంకటాపురానికి చెంది న సెల్ పాయింట్ నిర్వాహకుడు బొప్పం సుధాకర్‌లను అరెస్టు చేశారు.
మరో నింది తుడు ఇచ్చోడలోని పెట్రోల్ బంకు ఉద్యోగి వోట్కూరి నరేష్ పరారీలో ఉన్నాడని ఇచ్చోడ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన వెల్లడించారు. కాగా నిందితుల్లో షేక్ ఇర్ఫాన్ జల్సాలకు అలవాటు గూగుల్ ద్వారా నగల షాపుల వివరాలు తెలుసుకుని వారికి కాల్ చేసి, తాను ఎస్సైనంటూ బెది రించి డబ్బులు వసూలు చేస్తున్నాడు.
గత మూడు నెలల్లో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని నగల షాపుల యజమానులకు ఫోన్ చేసి దాదాపు రూ.18 లక్షలు వసూలు చేశాడు. అదేవిధంగా 1.36 గ్రాముల బంగారం, 14 తులాల వెండి కాలి పట్టీలను తన భార్యకు ఇచ్చాడు. వీటన్నిం టితో పాటు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. 2023లో బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో జైలుకు వెళ్లి, గత మార్చిలోనే విడుదలయ్యాడు.