24 March, 2026 | 7:59 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం

02-06-2025 02:41 AM
  1. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహణ

వైసీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి 

గుంటూరు, జూన్ 1: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి ధ్వజమెత్తారు. ఆదివారం పొన్నూ రు నియోజకవర్గంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోని దుర్మార్గమైన పాలన అంది స్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి చంద్ర బాబు కళ్లు తెరిపిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గుంటూ రు పార్లమెంట్ పరిశీలకులు పోతీన మహే ష్, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాం బాబు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడి కొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమం డ్ బాబు, పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్‌కుమార్, నూరి ఫాతిమా పాల్గొన్నారు.