19-12-2025 12:00:00 AM
స్వప్న సినిమాస్ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘ఛాంపియన్’. రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్‌గా దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు చీఫ్‌గెస్ట్‌గా విచ్చేసిన హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ.. “వైజ యంతి పేరు ఉంటే చాలు బ్లాక్‌బస్టర్స్ వస్తాయి.
రోషన్‌కు సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. హాలీవుడ్ యూరోపియన్ యాక్షన్ హీరో లా ఉన్నాడు. చాలా మంచి మనసున్నవారు శ్రీకాంత్, ఊహ. రోషన్‌కి వాళ్ల అందమే వచ్చింది. ఈ ‘ఛాంపియన్’ నా ‘మగధీర’ అంతటి హిట్ కావాలి. అనస్వర ఫేస్ చాలా కళగా ఉంది. మలయాళీ అయినా తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పింది. తప్పకుండా చాలా మంచి అవకాశాలు వస్తాయి” అన్నారు.
హీరో రోషన్ మాట్లా డుతూ.. “తను ఈ ఈవెంట్‌కు వస్తే నా ఐడెంటిటీ ఉండదని మా నాన్న అన్నారు. కానీ నాన్నా.. నీ ఐడెంటిటీనే నా ఐడెంటిటీ. చరణ్ అన్న రాకతో మా అందరిలో కొత్త జోష్ వచ్చింది. ఇది మైఖేల్ గాడి కథ, ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉంటుంది.
ఇది మన తెలుగు వాళ్ల చరిత్ర. బైరాన్‌పల్లి చరిత్ర. ఆ గ్రామంలో ఉండే వీరుల చరిత్ర” అని చెప్పారు. అనస్వర రాజన్ మాట్లాడుతూ.. “నేను రామ్‌చరణ్‌కి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన మా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపింది. డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ.. “సప్న సంకల్పం రోషన్ నమ్మకంతోనే ఈ సినిమా మీ ముందుకు వస్తుంది” అని తెలిపారు. నాగ్‌అశ్విన్, అశ్విని దత్, నటుడు శ్రీకాంత్, మూవీ యూనిట్ పాల్గొన్నారు.