20-11-2025 12:14:56 AM
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి) : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు సీసీ ఐపై తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేయడం సరికాదని, పత్తి దిగుబడి ఎంత వచ్చినా సీసీఐ మొత్తం కొనుగోలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచ ందర్‌రావు పేర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వం కొత్త జిన్నింగ్ మిల్లుల ప్రతిపాదనలు పంపితే, కేంద్రం ఇప్పుడున్న 200 కొనుగోలు కేంద్రాలతో పాటు మరో 100 కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ రైతులను తప్పుదారి పట్టిస్తోందన్నారు. రుణమాఫీ అమలు కాకపో వడం వల్ల రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చలేక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నల్లగొండ జిల్లా పుల్లెంల గ్రామానికి చెందిన ఒక రైతుతో పాటు మరోచోట రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదక రమని చెప్పారు.
మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ గతంలోని తమ పాలనా వైఫల్యాలను దాచేందుకు కేం ద్రంపై అనవసర నిందలు మోపుతోందన్నారు. రై తులకు బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీదన్నారు. తెలంగాణలో ఇప్పటికే 200కి పైగా కొనుగోలు కేంద్రా లు పనిచేస్తున్నాయని, కేం ద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముం దు కేవలం 70-80 కేంద్రాలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు అవి మూడింతలు పెరిగాయని పేర్కొన్నారు.
పంజాబ్‌లో ఎకరానికి 530 కిలోల ది గుబడి ఉంటే, హర్యానా-7, రాజస్థాన్-7, గుజరాత్-7, ఆంధ్రప్రదేశ్-9, కర్ణాటక-8 క్వింటాళ్లు నమోదయ్యాయని, కానీ తెలంగాణలో 12 క్వింటాళ్లు చూపించడం నమ్మశక్యంగా లేకపోవడం కొంత అనుమానాలకు దారితీ స్తోందన్నారు. గత సంవత్సరం తెలంగాణలో ప్రతి ఎకరాకు 6.32 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందన్నారు.
పత్తి కొనుగోళ్లలో, జిన్నింగ్ మిల్స్ విషయాల్లో తలెత్తిన ఇబ్బందులను తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పా రు. పత్తి మాయిశ్చర్ విషయంలో దేశవ్యాప్తంగా ఒకటే విధానాన్ని అమలు చేస్తున్నారని, తెలంగాణలో కూడా అదే పాలసీ అమల్లో ఉందన్నారు. భారతదేశం ఇప్పటికే లక్షల కోట్ల వస్త్ర ఎగుమతులు చే స్తోందని, దేశీయ తయారీని బలోపేతం చేసి, ప్రపంచ మార్కెట్‌ను విస్తరించేలా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.