calender_icon.png 20 November, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టోన్ క్రషర్లపై ఫోకస్?

20-11-2025 12:23:37 AM

  1. మాన్యువల్ విధానాలకు సర్కార్ స్వస్తి 

అమల్లోకి కొత్త విధానం

ఇకనుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 

ఖనిజ వినియోగంపైనిఘా

సంగారెడ్డి, నవంబర్ 19(విజయక్రాంతి): స్టోన్ క్రషర్ యూనిట్లలో విద్యుత్ వినియో గం ఆధారంగా ఇక ఖనిజ వినియోగ నిష్పత్తిని అంచనా వేస్తారు.. ప్రతీ టన్ను ముడి ఖనిజం ఉత్పత్తికి 4 కేవీఏహెచ్ విద్యుత్ వినియోగించబడుతుందని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ లెక్కల ఆధారంగా క్వారీలో వినియోగించిన యూనిట్లను లెక్కగడతారు. అలాగే సొంత వే బ్రిడ్జిని తప్పనిసరిగా ఏర్పా టు చేసుకోవాలి.

క్రషర్ చేయబోయే రాయి తూకం ఆటోమెటిక్ గా కంప్యూటర్ సిస్టంలో రికార్డు అయ్యేలా చేయాలి. ఈ రెండు అంశా ల ఆధారంగా ఆ యూనిట్లో ఎంత ఖనిజం వినియోగం జరిగింది.. క్రషర్ ద్వారా ఎంత ప్రొడక్షన్ వచ్చింది.. అనే లెక్కలపై స్పష్టత ఉంటుంది. ఇప్పటివరకు క్రషర్ల యూనిట్ల వద్ద ఎంత ఖనిజం వినియోగంపై యజమాని చెప్పిందే వేదంగా ఉండేది. విద్యుత్ వినియోగాన్ని ఆసలు పరిగణలోకే తీసుకునేవారు కాదు. అన్ని అంశాలకు సంబంధించి పూర్తిగా మాన్యూవల్ పద్ధతిలోనే సాగుతూ వచ్చింది. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అనే విధంగా పూర్తిగా ఆన్లైన్ పద్దతులను తీసుకొచ్చింది.

నూతన నియమావళి..

రాష్ట్ర ప్రభుత్వం స్టోన్ క్రషర్ల క్వారీలపై పర్యవేక్షణ, నియంత్రణ, పారదర్శకత కోసం కొత్తగా నియమావళి రూపొందించింది. జీవో నం.26ను నవంబర్ 1న జారీ చేసింది. వీటిపై క్రషర్ యజమానులకు అవగాహన కల్పిస్తుంది. అయితే యజమానులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

లీజుల దగ్గర మాత్రమే..

క్వారీ లీజుల దగ్గర మాత్రమే ముడి సరుకు (ఖనిజం) సేకరణ చేయాలి. అందుకోసం ఈ క్రషర్ యూనిట్ల వద్ద సీసీటీవీ, ఏఎన్పీఆర్ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీని పూర్తి బాధ్యత క్రషర్ యజమానిదే. ఈ కెమెరా ద్వారా అక్కడికి వచ్చే వాహన నంబర్లు, వే బ్రిడ్జి తూకాలు, పర్మిట్ సిస్టమ్ అనుసంధానం చేయబడుతుంది.

కెమెరా లైన్ ఫీడ్ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. తద్వారా ఆఫీస్ నుంచే అధికారి ఏ గనినైనా ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది. అంతేకాకుండా అక్కడికి వచ్చే వాహ నాలు, తూకం వివరాలు, పర్మిట్ సిస్టమ్ అన్ని ఆటోమెటిక్ గా నమోదవుతాయి.

నియమాలు ఇలా..

ప్రతినెలా 10లోపు ఫామ్-ఏ (విద్యుత్), ఫామ్-బి (ముడిసరుకు) వినియోగానికి సంబంధించి రిటర్న్ ప్రభుత్వానికి సమర్పించాలి. వరుసగా రెండు నెలలు రిటర్న్ సమర్పించకపోతే క్రషర్ రిజిస్ట్రేషన్ రద్దు చేసేలా నియమావళి రూపొందించారు. అలాగే పర్యావరణ నియమాలు తప్పనిసరి పాటించాలి. వాటి గడువు ముగిసిన పక్షంలో మళ్లీ రెన్యూవల్ చేసుకోవాలి. ప్రభుత్వానికి బకాయిలు ఉండరాదు. ఒకసారి యూనిట్ రద్దు అయితే మళ్లీ రిజిస్ట్రేషన్ చేయడానికి మూడేళ్ల పాటు నిషేధం విధించారు. 

ఉమ్మడి జిల్లాలో ఇలా..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లాలో 131 రాతి క్వారీలు ఉండగా, 178 క్రషర్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో 106 రాతి క్వారీలు ఉండగా, 83 క్రషర్లు ఉన్నాయి. అలాగే మెదక్ జిల్లాలో 112 క్వారీలు ఉండగా 105 వరకు క్రషర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా క్వారీలలో, క్రషర్లలో లెక్కలు తేలని విధంగా వేలాది వాహనాల్లో తరలిస్తున్నట్లు అంచనా. 

యజమానులకు అవగాహన కల్పిస్తున్నాం..

స్లోన్ క్రషర్ యూనిట్ల పర్యవేక్షణకు ప్రభుత్వం కొత్త నియమావళిని రూపొందించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆ యా యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 30-40 మంది యజమానులు ఆన్లైన్లో రిజిస్ట్రేష న్ చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆయా మార్పులను యూనిట్లవద్దచేపట్టాలి.

రఘుబాబు, ఏడీ, గనుల శాఖ, సంగారెడ్డి