calender_icon.png 17 October, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బడా’ బకాయిలు..

17-10-2025 12:00:00 AM

  1. నిజామాబాద్ బల్దియాలో పేరుకుపోయిన బకాయిలు

బకాయిపడిన బడావ్యాపారవేత్తలు, ఆస్పత్రులు, బిల్డర్లు..

ఫంక్షన్ హాళ్లు, మల్టీప్లెక్స్ ఓనర్లు, భారీ భవనాల యజమానులు..

నిజామాబాద్ అక్టోబర్ 16 (విజయక్రాంతి) : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బడా వ్యాపారవేత్తలు, ఆస్పత్రులు, బిల్డర్లు, ఫంక్షన్ హాల్, మల్టీప్లెక్స్ ఓనర్లు, భారీ భవనాల యజమానులు బల్దియాకు పన్నులు చెల్లించడం లేదు. స్పెషల్ డ్రైవ్ పేరిట పన్నుల వసూళ్ల కై కేవలం చిన్నచితక వ్యాపారులతో పై ఒత్తిడి చేస్తూ పిచ్చుకల మీద బ్రహ్మ హస్త్రాలు వేస్తున్నారన్న ఆరోపణలు ప్రజల నుండి వస్తున్నాయి.

గత పాలనలో విచ్చలవిడిగా నిర్మాణాలు జరిగాయి వాటి తాలూకు ప్రశ్నించే వారి కరువయ్యారు. బడా వ్యాపారవేత్తలు కోట్లలో మళ్లీ ఆకు పనులు బకాయిలో ఉన్నారు. గత 20 25 సంవత్సరాల నుండి పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్న బడాబాబుల పై నిష్పక్షపాతంగా విధులు నిర్వహించే మున్సిపల్ అధికారులు పన్నుల వసూలకై వెళ్ళినప్పుడు రాజకీయ ఒత్తిడిలతో  బ్రేక్ పడగా మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపరమైన సాకుతో అప్పటినుండి బల్దియాకు బకాయిలను టాక్స్లను చెల్లించడం లేదు.

వస్తువులకు వెళ్లిన అధికారులు కోర్టు వ్యవహారం కాబట్టి తామేమి చేయలేం అన్న నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఇది లో ఉండగా 35 కోట్లకు పైగా బల్దియాకు రావాల్సిన బకాయిలను వసూలు చేయడానికి చేస్తోంది. వివిధ పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు బల్దియాకు రావలసి నా డబ్బులు వసూలు కాకపోవడంతో బల్దియా ఆదాయానికి గండి పడుతుంది.

హలో అక్రమ కట్టడాల రెగ్యులరైజేషన్ మొటెషన్ ఇతరత్రా పన్నులు వసూలు కావలసి ఉండగా బడా వ్యాపారులు కోర్టులో దావా వేసి పనులు చెల్లించకుండా దాట వేస్తున్నారు.గతంలో మున్సిపల్ కార్పొరేషన్ లోని  కొందరు అవినీతి అధికారులు పాల్పడిన అవకతవకల వల్ల పన్ను చెల్లింపుదారులకు ఉచిత సలహాలు ఇచ్చి న్యాయపరమైన విషయమై కోట్లను ఆశ్రయించాల్సిందిగా సూచించడంతో ఈ సమస్యలు తలెత్తాయి.

సలహా ఇచ్చింది సాక్షాత్తు మున్సిపల్ రెవెన్యూ అధికారి కావడంతో రెక్కలు కట్టుకొని మరి కోర్టులను ఆశ్రయిస్తూ దర్జాగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.  బడా వ్యాపారస్తుల నుండి పన్నుల వసూళ్లు చేయాలంటే ప్రస్తుత బల్దియా సిబ్బందికి తలకు మించిన భారమైంది. నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటల్లు 15 నుండి 20 కోట్ల మధ్యలో బల్దియాకు బకాయపడ్డాయి.

ఇదిలా ఉండగా నగరంలోని స్థిరాస్తుల విషయమై అసెస్మెంట్ లు జరిగినప్పటికీని పన్ను చెల్లించకుండా దాటవేస్తున్న వారిని బల్దియా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దాదాపు 15 వందలకు పైగా అసెస్మెంట్ ఆస్తులకు సంబంధించి రావాల్సిన బకాయిలకు అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ వారి నుండి ఎలాంటి స్పందన రావడం లేదు. ఇదిలా ఉండగా నిర్ణీత గడువు లోపల ఆస్తి పనులు చెల్లించాలని లేదా తదుపరి బల్దియా చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరిస్తోంది. 

పన్నులు వెంటనే చెల్లించండి అభివృద్ధికి తోడ్పడండి 

కార్పొరేషన్ పరిధిలో భారీగా బకాయిలు పేరుకుపోయాయని వీటి వసూలకై రావాల్సిన డబ్బుల తాలూకు నోటీసులు జారీ చేస్తున్నామని ఈ విషయమై ప్రతి ఒక్కరు స్పందించి నగర అభివృద్ధికి తోడ్పడి బకాయిలను చెల్లించాలని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కోరారు.

్గ దిలీప్ కుమార్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్