calender_icon.png 18 October, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ నిబంధనల మేరకే డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక

17-10-2025 12:00:00 AM

ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్ కుమార్

మంచిర్యాల, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ ఆది స్థానం ఆదేశాలతో నియమ నిబంధనలను అనుసరించి డిసిసి అధ్యక్ష పదవికి అర్హులను ఎంపిక చేస్తామని ఏఐసీసీ ప్రతినిధి, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిశీలకులు డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. గురువారం ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ కో ఆర్డినేటర్లు శివలింగ్ శ్రీనివాస్ గౌడ్, అనిల్ కుమార్, జ్యోతిలతో కలిసి ఆయన మాట్లాడారు.

జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జు న్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు జరుగుతున్న సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నామని, ఇందుకోసం జిల్లాపై పట్టున్న, నాయకుల, కార్యకర్తలతో పాటు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న, అందరిని కలుపుకుపోయే వ్యక్తిత్వమున్న, పార్టీ అభివృద్ది కోసం పాటుపడే నాయకుడిని ఎంపిక చేస్తామన్నారు.

పార్టీ లైన్ ప్రకారం బలమైన, పార్టీ కోసం పని చేసే నాయకుడిని ఎన్నుకునేందుకు జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో క్షేత్ర స్థాయిలో ప్రజలు, కార్యకర్తల వద్దకు వెళ్లి వారి ఒపినియన్ కూడా తీసుకుంటామన్నారు. అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసు కున్న వారిలో నుంచి ఆరుగురిని ఎంపిక చేసి అధిష్టానంకు అందజేస్తామన్నారు.

అనంతరం పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి నాయకులతోపాటు మాజీ ప్రజా ప్రతినిధులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు ఫారా లు అందజేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పూదరి తిరుపతి, తూముల నరే ష్, గడ్డం త్రిమూర్తి, తిరుపతి పాల్గొన్నారు.