calender_icon.png 18 October, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు క్యాంపులు వినియోగించుకోవాలి

17-10-2025 12:00:00 AM

కలెక్టర్ రాజర్షి షా  

ఆదిలాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : రెండు రోజులుగా ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ వన్, మావల మండ ల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపలగూడ పాఠశాలలో జరుగుతున్న ఆధార్ కరెక్షన్, బయోమె ట్రిక్ అప్డేట్, బర్త్ సర్టిఫికెట్, రెసిడెన్సి సర్టిఫికెట్స్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా  తెలిపారు. విద్యార్థులు అన్ని సర్టిఫికెట్స్ ఒకే దగ్గర తీసుకునే విధం గా ఏర్పాటు చేశామన్నారు.

దీనివల్ల విద్యార్థు లు అపార్ ఐడిని అందరూ కలిగి ఉండడానికి సహకరిస్తుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలనీ సూచించారు. ఈ మూడు మండలాల పరిధిలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పిల్లల ఆధార్ కార్డులలో అపారు జనరేషన్ కు ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పనిసరిగా ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఈ కేంద్రాలలో చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, ఈ డిస్టిక్ మేనేజర్ రవి, సెక్టోరల్ అధికారులు రఘు రమణ, తిరుపతి, మండల విద్యాధికారులు ప్రధానోపాధ్యాయురాలు పాల్గొన్నారు.