calender_icon.png 20 August, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొల్లకొండ కోటపై జెండా ఎగరేసిన బహుజన బిడ్డ సర్వాయి పాపన్న

18-08-2025 02:10:48 AM

పాపన్నగౌడ్‌కు ఘన నివాళి అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ క్రైం,ఆగస్ట్17(విజయక్రాంతి): గొల్లకొండ కోటపై జెండాను ఎగరేసిన బహుజనుల ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. తన పోరాటాలతో మొగల్ చక్రవర్తుల వెన్నులో వణికి పుట్టించిన వీరుడని అభివర్ణించారు. సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం బీజేపీ కరీం నగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావులతో కలిసి కరీంనగర్ శి వారులో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం సర్వాయి పాపన్న సేవలను కొనియాడుతూ సామాన్య కల్లుగీత కుటుంబంలో పుట్టి నాటి మొగల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించిన అసామాన్యుడు, వెన్నుచూపని వీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. మొగల్ చక్రవర్తులకే ముచ్చెమటలు పట్టించి గో ల్కొండ ఖిల్కొండ జెండాను ఎగరేసిన కొదమ సింహం అన్నారు.

ఛత్రపతి శివాజీ మహరాజ్, సర్దార్ సర్వాయి పాపన్న దాదాపు సమకాలీనులే. ఇద్దరూ సామాన్య కుటుంబంలో పుట్టినోళ్లే. మొఘల్ చక్రవర్తులను ఎదిరించి రాజ్యాలను స్వాధీనం చేసుకున్న వాళ్లే. కానీ ఛత్రపతి శివాజీకి దేశ చరిత్రలో దక్కిన స్థానం సర్దార్ సర్వాయి పాపన్నకు దక్కకపోవడం బాధాకరం అన్నారు.

తాడిత, పీడిత ప్రజల కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి రాజ్యస్థాపన చేసిన సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ప్రతి ఒక్కరూ స్మరించకపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. ఈ కా ర్యక్రమంలో సర్వాయి పాపన్న గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పర్శరాములు గౌడ్, జిల్లా అధ్యక్షలు బుర్ర పర్శరాములు గౌడ్, తదితరులుపాల్గొన్నారు.