calender_icon.png 18 August, 2025 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రజలకు మార్వాడీలు క్షమాపణ చెప్పాలి

18-08-2025 02:12:09 AM

కరీంనగర్ క్రైం, ఆగస్టు 17 (విజయ క్రాంతి): మార్వాడి, గుజరాతి, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన బడా వ్యాపారులు తెలంగాణ రాష్ట్ర పౌరులను, దళిత యువకులను కొడుతే ఊరుకోవాలా ?తెలంగాణ ప్రజలను పౌరులను కించపరుస్తూ మాట్లాడుతున్న సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు ముతాడి శివరాజ్ తెలిపారు.

ఆదివారం నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొండ మార్కెట్లో ఒక దళిత యువకుడ్ని కులం పేరుతో దూషిస్తూ దారుణంగా కొడుతే మార్వాడీలకు బిజెపి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, బిజెపి వాళ్లు మద్దతు ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నించారు. తెలంగాణ కళాకారులను టార్గెట్ చేసి వారిని అరెస్ట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని ఇప్పటికైనా మార్వాడీలు,

గుజరాతి, రాజస్థాన్ వ్యాపారులు, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందని కుతాడి శివరాజ్ హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారుకురి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మొగురం మీరియా, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజేయ్, గందే కొమురయ్య ముదిరాజ్, ముంజ అశోక్ రెడ్డి, పెద్దెల్లి చంద్రకాంత్ యాదవ్, తదితరులుపాల్గొన్నారు.