18-08-2025 02:09:42 AM
హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 17 (విజయక్రాంతి): బంజారాహిల్స్‌లోని హరేకృ ష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఆదివారం నందోత్సవం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా హరే కృష్ణ మూవ్మెంట్ (ఇస్కాన్) స్థాపకాచార్యు లు, విశ్వగురు శ్రీల ప్రభుపాదుల 129వ వ్యాసపూజ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీల ప్రభు పాదుల శిష్యులు, భక్తులు వారికి 1008 రకాల నైవేద్య భోజన పదార్థాలను సమర్పించారు.
వ్యాసపూజ పుస్తకాన్ని హరే కృష్ణ మూవ్మెంట్, హైదరాబాద్ అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యగౌర చంద్రదాస్ ప్రసంగిస్తూ.. శ్రీల ప్రభుపాదుల వారి లక్ష్యాలు, ఆశయాల ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, ఆధునిక యుగంలో శ్రీకృష్ణుడి లీలలను జ్ఞాపకం చేసుకోవడంలో ఉన్న విలు వను ప్రస్తావించారు.