భూ కుంభకోణం కేసులో మాజీ సీఎంకు బెయిల్
28-06-2024 01:56 PM
రాంచీ: భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్‌పై జూన్ 13న తీర్పును రిజర్వ్ చేసిన రెండు వారాల తర్వాత హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. హేమంత్ సోరెన్ భూకుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. అరెస్టు నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ జనవరి 31 నుంచి జైలులో ఉన్నాడు. మార్చి 30న సోరెన్‌తో సహా ఐదుగురిపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.






