24 July, 2026 | 7:23 AM

ఒక్క వానకే ఢిల్లీ అతలాకుతలం

28-06-2024 02:37 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని కొన్ని ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. పగటిపూట మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఢిల్లీలో రాబోయే రెండు గంటల పాటు ఉరుములు గాలులతో కూడిన వర్షం కురుస్తోందని అధికారులు వెల్లడించారు. ఒక్క వానకే ఢిల్లీ అతలాకుతలం అయింది. మూడు గంటల్లో రాజధానిని వర్షం అల్లకల్లోలం చేయగా, సుమారు 15 సెంటిమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. 24 గంటల్లో ఢిల్లీలో 22.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. 1936 తర్వాత జూన్ లో ఒక్కరోజులో ఇంత వర్షం కురవడం ఇదే మొదటిసారి. భారీ వర్షానికి  కాలనీలు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపించాయి. వాహనాలు సబ్ వేల్లో నీట మునిగాయి. వర్షాలపై లెఫ్టినెంట్ గవర్నర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.