16 April, 2026 | 9:23 AM

ఉత్తమ రిపోర్టర్‌గా బైరి విశ్వనాథం

24-11-2025 12:00 AM

ఆలేరు, నవంబర్ 23 (విజయ క్రాంతి): ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన టిఆర్ 9 సీనియర్ రిపోర్టర్ బైరి విశ్వనాథం గౌడ్‌ను, టిఆర్ 9 8వ వార్షికోత్సవ సందర్భంగా టిఆర్ 9 న్యూస్ ఛానెల్ కు ఆలేరు నియోజకవర్గ స్థాయిలో ఎనలేని సేవలను అందించినందుకు గాను ఉత్తమ రిపోటర్ గా ఎపికైన  భైరి విశ్వనాథం గౌడ్ ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే  బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా  మెమొంటో అందజేసి శాలువాతో సత్కరించారు, ఈ సందర్భంగా టిఆర్ నైన్‌సిఓ  తూర్పు రమేష్, టి ఆర్ 9 సిబ్బంది ఆయనను అభినందించారు.