24-11-2025 12:00:00 AM
మేడ్చల్ అర్బన్ నవంబర్ 23 (విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని అక్బర్జాపేట్ శివారులో గల ప్రభుత్వ నక్ష రోడ్డును కబ్జా నుంచి కాపాడాలని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ కు ప్రజలు వినతి పత్రం అందజేశారు. అక్బర్జా పేట్ సర్వే నంబర్ 374 తో పాటు 375 లలో రాజ బొల్లారం ఘనాపూర్ అక్బర్జాపేట్ మూడు శివారులను కలుపుతున్న ప్రభుత్వ నక్ష రోడ్డు మార్గాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎంపీ సానుకూలంగా స్పందించి తక్షణమే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు అక్బర్జాపేట్ ప్రజలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు మహంకాళి సురేష్, కోటగిరి నాగరాజు, గ్రామ పెద్దలు గువ్వ రాములు,దేశం నవీన్,సుధాకర్,వీరేష్,గుంటి రవి,వెంకటేష్,నర్సింగరావు,నరేష్.నాగరాజు,నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.