18 June, 2026 | 9:53 AM

యుద్ధం ముగిసింది.. ఒప్పందంపై అమెరికా–ఇరాన్​ సంతకాలు

18-06-2026 09:14 AM

వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం( West Asia war) ముగిసిపోయింది. మధ్యంతర అవగాహన ఒప్పందంపై అమెరికా, ఇరాన్ అధ్యక్షులు సంతకాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) అవగాహన ఒప్పందంపై సంతకం( Trump signs US-Iran agreement) చేసినట్లు తెలిపారు. యుద్ధం ముగింపులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిగా వ్యవహరించారు. ఒప్పందంలో భాగంగా హర్మూజ్ ను ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.

ప్రతిగా ఇరాన్ పోర్టుల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తివేస్తుందని వెల్లడించారు. మధ్యంతర ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా విడుదల చేసింది.  తుది ఒప్పందానికి కట్టుబడి ఉండేలా ఐరాస భద్రతామండలి తీర్మానం ద్వారా ఆమోదించారు. ఒప్పందంలో యురేనియం అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. లెబనాన్ ను శాంతి ఒప్పందంలో ఆరుదేశాలు భాగం చేశాయి.  30 రోజుల్లో హర్మూజ్ దిగ్భందం పూర్తిగా ఎత్తివేయనున్నారు.

అమెరికా-ఇరాన్ ఒప్పందంలో 14 కీలక నిర్ణయాలు

1.లెబనాన్ సహా అన్ని చోట్ల సైనిక కార్యకలాపాలు తక్షణమే నిలిచిపోయేలా సంతకాలు.

2.సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవాలని ఒప్పందం. 

3.గరిష్ఠంగా 60 రోజుల్లోపు చర్చలు జరిపి తుది ఒప్పంద సాధనకు నిర్ణయం. 

4.ఇరాన్ లో ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా తొలగించాలని ఒప్పందం. 

5.హర్మూజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణ కృషికి నిర్ణయం. 

6.60 రోజుల పాటు రుసుం లేకుండా ప్రయాణానికి ఇరాన్ కృషి చేయాలని ఒప్పందం. 

7.ఇరాన్ పునర్నిర్మాణానికి 300 బిలియన్ల డాలర్ల సాయానికి అమెరికా అంగీకారం.

8. ఇరాన్ పై భద్రతామండలి, ఐఏఈఏ తీర్మానాలు, ఆంక్షలు ఎత్తివేతకు అంగీకారం. 

9.అణ్వాయుధాలు అభివృద్ధి చేయబోమని ఇరాన్ అంగీకారం. 

10.తుది ఒప్పందం జరిగే వరకు యథాతథ స్థితికి అమెరికా-ఇరాన్ అంగీకారం.

11.ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతికి అమెరికా హామీ. 

12.బ్యాంకింగ్ లావాదేవీల మినహాయింపునకు అమెరికా హామీ. 

13.స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను వినియోగించుకోవడానికి అమెరికా హామీ.

14.ఎంఓయూ అమలు, తుది ఒప్పందంపై పర్యవేక్షణకు యంత్రాంగం ఏర్పాటు.