పెబ్బేరులో ఘనంగా బక్రీద్ వేడుకలు
పెబ్బేరు మే 28: త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని పెబ్బేరు పట్టణంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక జామే మస్జీద్ నుంచి దైవ ప్రవచనాలు పఠిస్తూ పెద్ద ఎత్తున ఈద్గాకు చేరుకున్న ముస్లింలు మౌలానా ఇబ్రహీం ఆధ్వర్యంలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మౌలానా ఇబ్రహీం బక్రీద్ పండుగ విశిష్టత, ఖుర్బానీ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. త్యాగం, సహనం, సోదరభావం మన జీవితంలో ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అనంతరం ముస్లింలు ఖబరస్తాన్కు వెళ్లి తమ కుటుంబ పెద్దల ఆత్మశాంతి కోసం ప్రత్యేక దువాలు చేశారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, స్పోరట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి ఈద్గా వద్దకు హాజరై ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సౌహార్ద వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు.






