22-08-2025 12:43:31 AM
పవన్ కేసరి, కావ్యా కళ్యాణ్‌రామ్ జంటగా ఓ సినిమా రానుంది. కుంచం శంకర్ దర్శకత్వంలో టీడీఆర్ సినిమాస్ బ్యానర్‌పై తలారి దినకరణ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రామ్ అబ్బరాజు, ప్రశాంత్ కుమార్ దిమ్మెల, అడిదాల విజయ్‌పాల్‌రెడ్డి అతిథులుగా విచ్చేశారు. తలారి హేమావతిరెడ్డి, మూవీ టీమ్ పాల్గొన్నారు.
రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభిస్తారు. సుగుణ, సుప్రి య, దివిజ ప్రభాకర్, మోయిన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్; కెమెరామెన్: సాయి; ఎడిటర్: విప్లవ్; ఆర్ట్: క్రాంతి ప్రియం; నిర్మాత: తలారి దినకరన్‌రెడ్డి; దర్శకత్వం: కుంచం శంకర్.