calender_icon.png 25 August, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెమిని సురేశ్ తొలిచిత్రం ఆత్మకథ

22-08-2025 12:42:09 AM

జెమిని సురేశ్ హీరోగా ఓ సినిమా రానుంది. ఇందులో ఆయన సరసన అఖిల నాయర్ హీరోయిన్‌గా జత కట్టనుంది. వారాహి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్‌పై శ్రీనివాస్ గుండ్రెడ్డి రచనాదర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. జెమిని సురేశ్ తల్లి జెమిని సుబ్బలక్ష్మి ఈ చిత్రానికి తొలి క్లాప్ కొట్టి ప్రారంభించారు. పలువురు సినీపరిశ్రమ ప్రముఖులు, చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జెమిని సురేశ్ మాట్లాడుతూ.. “ఇది నా తొలి చిత్రం. నా 18 ఏళ్ల కల నెరవేడబోతోంది. టీవీ ఆర్టిస్ట్‌గా ఉన్న నేను మంచి కథతో వెండితెర ప్రేక్షకులు ముందుకు రావాలనుకున్నా. ఆ మంచి కథే శ్రీనివాస్ చెప్పిన ఈ ‘ఆత్మకథ” అన్నారు. ఈ చిత్రానికి సోమేశ్వరరావు నిర్మాత. అర్థం వారాహి శ్రేయాస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎంవీ గోపి డీవోపీగా, రాఘవేంద్రరెడ్డి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.