బాసరలో భక్తుల రద్దీ
17-06-2024 12:25 AM
నిర్మల్, విజయక్రాంతి: నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ దేవి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పాఠ శాలలు ప్రారంభమైన నేపథ్యంలో ఆదివా రం తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు పోటీ పడ్డారు. ఉదయం నుంచి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అ మ్మవారి దర్శనానికి 2 గంటలు సమయం పట్టింది.






