24 April, 2026 | 1:39 PM

‘అత్యుత్తమ సీఎండీ’గా బలరామ్

20-09-2025 12:19 AM

-సింగరేణి సీఎండీకి ప్రతిష్టాత్మక పురస్కారం

-అత్యుత్తమ సంస్థల నాయకుల క్యాటగిరిలో గుర్తింపు   

-ప్రకటించిన ఏసియా పసిఫిక్ హెచ్‌ఆర్‌ఎం కాంగ్రెస్  

-బెంగళూరులో  అవార్డు అందజేసిన నిర్వాహకులు

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో నడుపుతూ, గత ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో పాటు వివిధ వ్యాపార విస్తరణ చర్యలతో సంస్థకు గట్టి ఆర్థిక పునాదులు వేసిన సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్‌కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ సంస్థల నాయకుల క్యాటగిరీలో అత్యుత్తమ సీఎండీగా గుర్తిస్తూ ప్రతిష్టాత్మక ఏసియా పసిఫిక్ హెచ్‌ఆర్‌ఎం కాంగ్రెస్ ఈ అవార్డును ప్రదానం చేశారు.

ఏసియా పసిఫిక్ హెచ్‌ఆర్‌ఎం కాంగ్రెస్ వారు గురువారం సాయంత్రం బెంగళూరులో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో ఈ అవార్డును ఆయన అందుకున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ఇన్ మేనేజ్మెంట్ (కోల్‌కతా) ఛైర్మన్, డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్.పి.బెనర్జీ, అడ్వాంటెజ్ గ్రూప్ వ్యవస్థాపకురాలు స్మితి భట్ దియోరా తదితరులు పాల్గొన్నారు.