calender_icon.png 20 September, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల తీరుపై కలెక్టర్ అసంతృప్తి

20-09-2025 12:21:50 AM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రభుత్వ పథకాల అమలు తీరు పట్ల అలసత్వాన్ని నిలదీస్తూ జిల్లా అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుపై సమీక్షిస్తూ పనులను వేగవంతం చేయాలన్నారు. పథకాల అమలులో ఆలస్యం, పర్యవేక్షణ లోపం, నివేదికలు సమయానికి అందకపోవడంపై  మండిపడ్డారు. లబ్ధిదారులకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా సెర్ప్, మెప్మా ద్వారా రుణ సౌకర్యం కల్పించాలన్నారు. అర్హులైన వారికి ఇళ్లు తక్షణం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.