01-07-2025 03:11:26 PM
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరికి రాజ్యాంగ హక్కులు అందించే విధంగా పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు కుతాడి శివరాజ్ అన్నారు. ఈనెల 30 న కరీంనగర్ లో రాష్ట్ర సదస్సును నిర్వహించండం జరుగుతుందిని అన్నారు. కరీంనగరలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసారు. సామాజిక న్యాయం కోసం నిరుపేద ప్రజల కోసం పనిచేసే పార్టీకి అందరూ మద్దతు ఇవ్వాలని సదస్సును విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు. శ్రేయోభిలాషులకు. పార్టీ అనుబంధ మహిళ సంఘాలు. కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు.