01-07-2025 03:46:54 PM
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాశమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే 36కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 31 మంది చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పటాన్ చెరు ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లారు. సిగాచి పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరమని, ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆమె ఆరోపించారు. పరిశ్రమల్లో రక్షణపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.