calender_icon.png 12 October, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ ఎస్​హెచ్​వో అశోక్ బదిలీ..

12-10-2025 06:47:54 PM

నూతన ఎస్​హెచ్​వోగా తూల శ్రీధర్..

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ ఎస్​హెచ్​వోగా విధులు నిర్వహిస్తున్న మండల అశోక్ ని ఆదివారం ఐజి చంద్రశేఖర్ రెడ్డి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్ 1 పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఎస్ హెచ్ వోల బదిలీలో భాగంగా కామారెడ్డి పోలీస్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న తుల శ్రీధర్ ను బాన్సువాడ ఎస్ హెచ్ వో గా నియమించారు. బాన్సువాడలో విధులు నిర్వర్తిస్తున్న మండల అశోక్ ను ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.