calender_icon.png 25 September, 2025 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకట్ గౌడ్ మృతి పట్ల బండి, పొన్నం సంతాపం

25-09-2025 01:03:10 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కొంపల్లి వెంకట్ గౌడ్  ఆకస్మిక మరణం  తీవ్ర విషాదాన్ని కలిగించిందని కేంద్ర , మంత్రులు బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ లు పేర్కొన్నారు. ఆయన సాహిత్య రంగంలో,సమాజ సేవలో, తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషి మరువలేనిదన్నారు. గౌడన్నల ఆత్మగౌరవాన్ని తన రచనల ద్వారా చాటారని సర్వాయి పాపన్న చరిత్రను అక్షర బద్దం చేసి ప్రజలకు అందించారని పొన్నం ప్రభాకర్ అన్నారు.  తెలంగాణ తత్వం, ఉద్యమ భావజాలాన్ని తన కలంలో నింపుకున్న కొంపెల్లి వెంకట్ గౌడ్  మృతి తెలంగాణ తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు ఈ దుఃఖాన్ని తట్టుకుని ధైర్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు.