calender_icon.png 25 September, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఏమైంది..?

25-09-2025 01:12:16 PM

ధర పెరుగుతుంది కానీ ప్రభుత్వం కరుణించడం లేదు 

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపణి లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి 

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలకు ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా లబ్ధిదారులకు బంగారం ఇవ్వడంలో విఫలమైందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Lakshmi) విమర్శించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 93 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపించేశారు. వీటితోపాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్దెనెక్కెందుకు మాత్రమే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందని తెలిపారు.

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ వారు గొప్పగా చెప్పుకున్న ఆరు గ్యారెంటీలు కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించాలి. పేద ప్రజలు లక్ష రూపాయల నగదు తో పాటు తులం బంగారం తమ ఆడబిడ్డ పెళ్ళికి వస్తుందని ఎంతో ఆశతో ఓట్లు వేస్తే ఇప్పుడు మాత్రం దాని ఊసే ఎత్తడం లేదని అన్నారు. బూటకపు మాటలతో నయ వంచన చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ హైమద్, తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.