25-09-2025 01:07:15 PM
వేములవాడ టౌన్, (విజయక్రాంతి): పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాల్ జయంతి(Deen Dayal Jayanti celebrations) సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పట్టణ శాఖ ఈ సందర్భంగా అధ్యక్షులు రాపెళ్లి శ్రీధర్ మాట్లాడుతూ వారు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడిగా మరియు భారతీయ జనతా సంఘ ఉపాధ్యక్షుడిగా ఉంటూ శ్యామ్ ప్రకాశ్ ముఖర్జీ మరణ అనంతరం ఆపద సమయంలో పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించి భారతదేశానికి బిజెపి సేవలందించేందుకు పునాదులు వేశారని గుర్తు చేస్తూ వారి అడుగుజాడల్లో యువత నడుచుకోవాలని సూచించారు . కన్వీనర్ పిన్నింటి హనుమాన్లు మాట్లాడుతూ. ఉపాధ్యాయునిగా పండిట్ గా తను చేసిన సేవలు మరువలేని అని కొనియాడారు రేగుల రాజ్ కుమార్ మాట్లాడుతూ. వారి పుట్టుక దేశానికి గర్వ కారణమని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకన్న జవ్వాజి శేఖర్ అన్నం నరసయ్య గుడిసె మనోజ్ నేరెళ్ల సాయి కిరణ్ బిల్లా కృష్ణ మంత్రి రమేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.