calender_icon.png 25 September, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండికి కిరాణం, జనరల్ మర్చంట్ సంఘం వినతి

25-09-2025 01:05:48 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లా కిరాణం, జనరల్ మర్చంట్ సంక్షేమ సంఘం తరపున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay) కి విన్నపం అందజేశారు. సంఘం భవన నిర్మాణం కోసం మాజీ మంత్రి గంగుల కమాలకర్ ఇప్పటికే 330 గజాల స్థలాన్ని కేటాయించారని పేర్కొంటూ, నిర్మాణానికి అవసరమైన 50 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయవలసిందిగా కోరారు. ఇటీవల జీఎస్టీ ధరలు తగ్గించినందుకు మంత్రి బండి సంజయ్కు సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విన్నపాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎలగందుల మునీందర్ నేతృత్వంలో సమర్పించారు.