రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తోపుడుబండ్ల పంపిణీ
రోటరీ క్లబ్ సేవలను కొనియాడిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, (విజయక్రాంతి): రోటరీ క్లబ్ కరీంనగర్ చేస్తున్న సేవలు అభినందనీయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం చైతన్యపురి మహాశక్తి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ కరీంనగర్, రోటరీ క్లబ్ మొయినాబాద్ సహకారంతో పది తోపుడు బండ్లను వీధి వ్యాపారులకు పంపిణీ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వీధి వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి వీధి వ్యాపారులతో మాట్లాడారు...రోజువారి ఆదాయం ఎలా ఉంటుంది, మీ కుటుంబ పోషణ సరిపోతుందా..? అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ తోపుడు బండిని కుటుంబ పోషణకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్ లు జీవి కిషన్, పవన్ కృష్ణ, కిరణ్ కుమార్, అరవింద్, రామేందర్, రాజశేఖర్ లను కేంద్రమంత్రి బండి సంజయ్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు రోటరీ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డి. కె. ఆనంద్, రోటరీ క్లబ్ కరీంనగర్ అధ్యక్షుడు జి. వెంకట కిషన్, కార్యదర్శి పాక పవన కృష్ణ, మాజీ కార్పొరేటర్ చీటీ రామారావు, రామ్ మోహన్ రావు, ఆనంద్ కుమార్ పసుల తిరుపతి ప్రభాకర్ రావు చందర్ లక్ష్మీనారాయణ ఆంజనేయులు రాజేందర్ తిరుపతి క్లబ్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.