15 August, 2026 | 1:45 AM

నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 01:11 AM

కరీంనగర్‌లో అడ్లూరి, జగిత్యాలలో అజారుద్దీన్, పెద్దపల్లిలో చింతకుంట, సిరిసిల్లలో అది

కరీంనగర్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ఈనెల 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్ల చేశారు. కరీంనగర్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే వేడుకల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

జగిత్యాల పరేడు గ్రౌండ్లో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, పెద్దపల్లి లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, సిరిసిల్లలో ప్ర భుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు జాతీయ పతాకాన్ని అవిష్కరించనున్నారు. వేదిక నిర్మాణం, పతాకావిష్కర ణ స్థలం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రాం గణం, స్టాల్స్, పార్కింగ్, భద్రతా చర్యలు వంటి అంశాలను ఆయా జిల్లా కలెక్టర్లు ప్రత్యక్షంగా సమీక్షించారు. ప్ర భుత్వ గౌరవాన్ని నిలబెట్టేలా అన్ని ఏర్పాట్లు నాణ్యతతో చేయాలని అన్నారు. జిల్లా ప్రజలంతా స్వాతంత్ర దినోత్సవ దినోత్సవాన్ని గౌరవంగా, దేశభక్తి వాతావరణంలో జరుపుకోవాలని ఆహ్వానించారు.