calender_icon.png 30 December, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కన్నుమూత

30-12-2025 09:44:11 AM

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలీదా జియా(Khaleda Zia dies) దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారని ఆమె వ్యక్తిగత వైద్యుడు మంగళవారం తెలిపారు. దేశపు తొలి మహిళా ప్రధానమంత్రి(Bangladesh former Prime Minister ), బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పి) అధ్యక్షురాలైన జియా 80 ఏళ్ల వయసులో కన్నుమూశారని ఢాకా ట్రిబ్యూన్ పత్రిక నివేదించింది. ఆమె వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఏజెడ్ఎం జాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, ఆమె మంగళవారం తెల్లవారుజామున ఢాకాలోని ఎవర్కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని తెలిపారు. 1945 ఆగస్టు 15 న బెంగాల్ జల్ పాయిగుడిలో ఖలీదా జియా జన్మించారు. బంగ్లాదేశ్ చరిత్రలో ఖలీదా జియా మొదటి మహిళా ప్రధాని. జియా మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

బంగ్లాదేశ్ మాజీ రాష్ట్రపతి రెహమాన్ సతీమణి ఖలీదా జియా. ఖలిదా రెహమాన్ స్థాపించిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఛైర్ పర్సన్ ఉన్నారు. 1981లో రెహమాన్ హత్య తర్వాత ఖలీదా రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1981 నుంచి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(Bangladesh National Party) అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఖలీదా 1982లో సైనిక తిరుబాటు అణచివేసి ప్రజాస్వామ్యం నెలకొల్పారు. అవామీలీల్ నాయకురాలు షేక్ హసీనా(Sheikh Hasina), ఖలీదా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. విదేశీ విరాళాలు దుర్వినియోగం కేసులో ఖలీదా జియాకు 17 ఏళ్లు జైలుశిక్ష పడింది. జనవరి 2025లో సుప్రీంకోర్టు ఆమెపై ఉన్న చివరి అవినీతి కేసులో జియాను నిర్దోషిగా ప్రకటించింది. ఇది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలలో ఆమె పోటీ చేయడానికి వీలు కల్పించేది. ఆమె యునైటెడ్ కింగ్‌డమ్‌లో వైద్య చికిత్స చేయించుకున్న తర్వాత మే నెలలో దేశానికి తిరిగి వచ్చింది. జనవరి ప్రారంభంలో, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం(Bangladesh interim government) ఆమెకు విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. అంతకు ముందు హసీనా ప్రభుత్వం ఆమె అభ్యర్థనలను కనీసం 18 సార్లు తిరస్కరించింది.