calender_icon.png 30 December, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారం కోసం ఇంటి ఓనర్‌ హత్య

30-12-2025 10:47:25 AM

నాచారంలో దారుణం.. 

యజమానిని హత్య చేసిన ముగ్గురు యువకులు..

హైదరాబాద్: నాచారం పరిధిలో మిస్సింగ్ కేసును(Nacharam missing case) పోలీసులు చేధించారు. మహిళను హత్య చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారం కోసం ఇంటి యజమానిని నిందితులు హత్య చేశారు. హత్య అనంతరం మృతదేహాన్ని గోదావరి నదిలో పడేశారు. సుజాత అనే మహిళ మల్లాపూర్ లో ఒంటరిగా నివసిస్తోంది. సుజాత ఇంట్లో అద్దెకు ఉంటున్న అంజిబాబు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ నెల 24న సుజాత కనిపించకపోవడంతో ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంజిబాబు కూడా కనిపించకపోవడంతో అనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అంజిబాబు బంగారం కోసం హత్య చేసినట్లు గుర్తించారు. స్నేహితులు యువరాజు, దుర్గారావు సాయంతో అంజిబాబు నేరం చేసినట్లు వెల్లడించాడు. సుజాత మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణ లంకకు తరలించి గోదావరిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అంజిబాబుకు సహకరించిన స్నేహితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.