30-12-2025 01:59:29 AM
హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : గడ్డం పెంచినోళ్లంతా గబ్బర్ సింగ్ కాలేరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. గడ్డాలు పెంచడం చాలా ఈజీ.. కానీ పాలన చేయడమే కష్టమని వ్యాఖ్యానించారు. ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు పేరు వస్తుందన్న భయంతోనే రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కృష్ణా నది నుంచి నీళ్లు తీసుకుంటే చంద్రబాబుకు కోపం వస్తుందని, అందుకే ప్రాజె క్టును పండబెట్టి కాలువలు కూడా తవ్వ డం లేదని విమర్శించారు.
శాసనసభ ఆవరణలో మీడి యాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా ముం దుగా తాగునీటి అవసరాల పేరుతోనే ప్రాజెక్టులను ప్రారంభిస్తుందని, అనంతరం అన్ని అనుమతులు తెచ్చుకోవడం పరిపాటేనని కేటీ ఆర్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ బయటకు చెప్పరని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు గురించి 70 ఏండ్ల నుంచి వింటున్నామని, కానీ ఇప్పటికీ అది పూర్తికాలేదని గుర్తుచేశారు.
అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం తమ నాయ కుడు కేసీఆర్ హయాంలోనే పూర్తయిందని, దీనికి కారణం నిబద్ధతే అని స్పష్టం చేశారు. కాలంతో పోటీపడి మరీ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. కాళేశ్వరంలో రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందే తప్ప రాజకీయంగా తమకు నష్టం జరగదని అన్నారు.
ప్రజలకు నీళ్లు ఇచ్చింది ఎవరో ప్రజలకు బాగా తెలుసని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయం లో 45 టీఎంసీలకు ఒప్పుకుంటే అది నష్ట మే అవుతుందని, 299 టీఎంసీలకు ఒప్పుకున్నది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. దాని ఆధారంగానే తమ ప్రభు త్వం మరిన్ని నీటి కేటాయింపుల కోసం కేంద్రాన్ని కోరిందన్నారు.
అక్రమాలు బయటపడుతాయనే..
రేవంత్‌రెడ్డి అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయనే కారణంతోనే ఆయన బూ తులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తనపై వ్యాఖ్యలు చేస్తే తాను స్పందించనని, కానీ తన తండ్రి కేసీఆర్‌పై మాట్లాడితే మా త్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రే వంత్ బూతులకు తాను స్పందిస్తే తన స్థాయికి దిగజారొద్దని కొందరు చెబుతున్నారని అన్నారు. నీళ్ల గురించి ప్రశ్నిస్తే నికృ ష్టమైన మాటలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ ప్రెస్‌మీట్‌కు కాంగ్రెస్ నాయకులు అల్లా డిపోతున్నారని చెప్పారు.
మీడియా ముందు కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడుతున్నది అన్నారు. అలాంటప్పుడు కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేయడం హా స్యా స్పదమన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తే ఈరోజు నీటిపారుదల శాఖ సలహాదారుడిగా ఉన్నారని అన్నారు. కనీస అవగాహన లేని వారు కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారని విమర్శించారు.
కేసీఆర్ వస్తున్నారన్న మాట వినగానే కాంగ్రెస్ నాయ కులు చర్చకు ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. గడ్డం, మీసాలు లేవని రేవంత్‌రెడ్డి అన్నది తనను కాదని, రాహుల్ గాంధీని, రాజీవ్‌గాంధీని కూడా అన్నారని చెప్పారు. గడ్డం పెంచిన ప్రతి ఒక్కరూ గబ్బర్‌సింగ్ కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. గడ్డాలు పెంచడం ఈజీ కానీ పాలన చేయడమే కష్టమన్నారు.
అటెన్షన్ డైవర్షన్ కోసమే..
ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ సమాచారం వస్తుందని, గూఢచారి వ్యవస్థ నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉందని చెప్పారు. శాంతిభద్రతలు, రాష్ర్ట రక్షణ కోసమే ఈ వ్యవస్థ పనిచేస్తుందని అన్నారు. ఈ రోజు నిఘా వ్యవస్థ లేదా ఫోన్ ట్యాపింగ్ లేదని ఎవరైనా అనగలరా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పగలరా అని ప్రశ్నించారు.
ట్యాపింగ్ నిజం కాకపోతే అధికారులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదని అడిగారు. ప్రస్తుత డీజీపీ కూడా అప్పట్లో అధికారులుగానే ఉన్నారని, ఆయనకు కూడా నిఘా వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఎస్‌ఐటీ వంటి డ్రామాలతో ప్రజల దృష్టిని ఎంతకాలం మళ్లిస్తారని ప్రశ్నించారు. ఈ అటెన్షన్ డైవర్షన్‌తో ఎంతకాలం కాలం వెల్లదీస్తారని అన్నారు.
మాటల్లోనూ సంస్కారం ఉండాలి
కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలని, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి హో దాలో శాసనసభలో కేసీఆర్‌ను కలిసేంత సంస్కారం ఉంటే చాలని వ్యాఖ్యానించారు. ఇదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉంటే బాగుంటుందన్నారు. ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉండాలన్నారు.
తాను ఆంధ్రా లో చదివితే తప్పు అంటారని, కానీ అల్లుడిని మాత్రం ఆంధ్ర నుంచి తెచ్చుకున్నారని ఎద్దే వా చేశారు. పంచాయతీలలో తమ పార్టీ గొప్ప ఫలితాలు సాధించిందని, రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ని తిరస్కరించార ని అన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు కష్టపడి పార్టీ నేతల సహకారంతో భారీగా సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నమని తెలిపారు.
డబ్బుల కోసమే అడ్డగోలు విభజన..
జీహెచ్‌ఎంసీని మూడు భాగాలుగా విభజిస్తారన్న ప్రచారం జరుగుతోందని, ఫోర్త్ సిటీ అని పెట్టిన దానిని కూ డా కార్పొరేషన్ చేస్తారేమోనని అన్నా రు. ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలని, ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోబో మని, అన్నింటికీ సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. చర్చ పెట్టాల ని, ఆ చర్చలో తమ పార్టీ అన్ని విషయాలూ మాట్లాడుతుందని చెప్పారు.
జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం ఏం చేసుకుంటారో, ఎవరికీ లాభం చేకూర్చేలా చేసుకుంటారో వారి ఇష్టమని వ్యాఖ్యానించారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు చరిత్రాత్మకమని, అటువంటి ఎన్నికలను ఇప్పటివరకు చూడలేదని, మళ్లీ చూడబోమని అన్నా రు. కేవలం డబ్బుల సేకరణ కోసం మ ర్చంట్ బ్యాంకర్లు, బ్రోకర్లు చెప్పినట్లు డీలిమిటేషన్ చేస్తున్నారని ఆరోపించారు.