10-11-2025 12:00:00 AM
మాజీ ఎంపీ రవీందర్ నాయక్
ఖైరతాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి) : బంజార భారత్ స్వర్ణోత్సవాలు ఈ నెల 19 నుంచి 21 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్నట్టు బంజార భారత్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎంపీ ధారవత్ రవీంద్రనాయక్ తెలిపారు. ఆదివారం సోమాజి గూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బంజార భారత్ అధ్యక్షులు ప్రథ్వీసింగ్ రాథోడ్, నాన్ ఏజెన్సీ వికారాబాద్ ఏరియా అధ్యక్షులు రాఘవన్ నాయక్, జాతీయ మహిళా కన్వీనర్ ఎ. నాగమణి నాయక్, జె.బి.రాజులు మాట్లాడారు.
బంజార భాష గౌర్బోలి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించి, పార్లమెంట్లో ఆమోదింపజేయాలని కోరారు. బ్రిటిషు, మొగలుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన బంజారాల ్యరసాహసాలకు గుర్తుగా ’బంజార రెజిమెంట్ను స్థాపించాలని కోరారు. అనంతరం చలో బంజార భారత్ నగారా ఢంకాను రవీంద్రనాయక్ మోగించారు. సమావేశంలో బంజార నేత లు కె. హరిచంద్ నాయక్, కె.నరేశ్ కుమార్, సబ్లే అమర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.